వైసీపీలోకి వలసలు : pvp ప్రసాద్, రాజారవీంద్రలకు ఆహ్వానం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ఆర్ సీపీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాణ సంస్థ pvp అధినేత పొట్లూరి వర ప్రసాద్ ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లో చేరారు.

విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు వైసీపీలో చేరుతున్నారు. రత్నబిందు… సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ బావమరిది భార్య. ఆమె చిరంజీవి కుటుంబసభ్యురాలు.

టీడీపీ సీనియర్ నాయకులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తోట నరసింహులు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో జాయిన్ అవుతున్నారు.

సినీ నటుడు రాజా రవీంద్ర ఇవాళ YCPలో చేరారు. జగన్ ఆయనకు వెల్కమ్ చెప్పారు. .

ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మరియు ఆమె భర్త SMR పెద్ద బాబు వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. SMR పెద్దబాబు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి.