హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అర్శినపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన ఆయన ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఉత్కంఠ భరింతంగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయన మద్దతుదారులు ఉప్పల్ స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు ప్రత్యర్థి అమర్నాథ్ రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవికి జగన్ మోహన్ రావ్, అమర్నాథ్, అనిల్ కుమార్, పి.ఎల్ . శ్రీనివాస్ బరిలోకి దిగారు. అయితే చివరకు జగన్ మోహన్ రావే విజయం వరించింది. ప్రస్తుతం జగన్ మోహన్ రావు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు.
మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా 3 గంటలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది సభ్యులకు గాను 169 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ప్రెసిడెంట్ – జగన్ మోహన్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్)
- వైస్ ప్రెసిడెంట్ – దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానేల్)
- సెక్రెటరీగా దేవరాజు(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)
- జాయింట్ సెక్రెటరీగా బసవరాజు..(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
- ట్రెజరర్ – సిజే శ్రీనివాస్ రావు(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్)
- కౌన్సిలర్ – సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్