ఏపీలో రెడ్ బుక్ కిరాతక పాలన చూడండీ : ఢిల్లీలో జగన్ ఎగ్జిబిషన్

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. 45 రోజుల్లోనే 30 కి పైగా హత్యలు జరిగాయని 300 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ హయాంలో హత్యా రాజకియాలు ప్రొత్సహించలేదన్నారు జగన్.  ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఫోటో ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.  560 ప్రైవేట్ బస్సులు ధ్వంసం అయ్యాయని తెలిపారు. పోలీసులు రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటున్నారని అన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. ఏపీ లో శాంతి భద్రతలు లోపించాయని తెలిపారు. ఏపీలో రాష్ట్ర పతి పాలన విధించాలని కోరారు జగన్.