కేసీఆర్ లాగే జగన్ అరాచక పాలన చేశారు.. మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

కేసీఆర్ లాగే జగన్ అరాచక పాలన చేశారు.. మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  తమ పాలనకు పట్టం కట్టారని చెప్పారు. మూడు పార్లమెంట్ సీట్ల నుండి 8 సీట్లకు చేరామని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ ని నమ్మారని తెలిపారు. దేవుడ్ని రాజకీయం కోసం వాడుకున్నా బీజేపీ టార్గెట్ రీచ్ అవ్వలేదని విమర్శించారు. 

మోదీ పాలన చాలని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డిపై అక్కసుతో బీఆర్ఎస్ తన వేలితో తన కంటిని పొడుచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలని బీజేపీ- బీఆర్ఎస్ ఏకమయ్యాయని తెలిపారు. తన పార్టీ నాశనం అయిపోయినా సరే కాంగ్రెస్ గెలవద్దని కేసీఆర్ అనుకున్నాడని చెప్పారు. శ్రీరాముడు, హనుమంతుడు, అక్షింతలు అంటూ నానా యాగీ చేసినా ప్రజలు మావైపు నిలబడ్డారని అన్నారు. 

నాలుగు సీట్లకు పరిమితం కావాల్సిన బీజేపీని ఎనిమిది సీట్లకు తీసుకువచ్చింది కేసీఆరేనని చెప్పారు. కవిత జైలు నుండి బయటకి రావడానికి తన పార్టీని బీజేపీకి అప్పజెప్పాడని ఆరోపించారు. ఏపీలో ఊహించని ఫలితాలు వచ్చాయని అన్నారు. రాచరిక పాలన చేస్తే ఇంటికి పంపిస్తామని ఏపీ ప్రజలు తేల్చి చెప్పారని అన్నారు. కేసీఆర్ లాగే జగన్ అరాచక పాలన కొనసాగించారని అన్నారు.