![పేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం..... పెత్తందార్లకు అండగా చంద్రబాబు: మాజీమంత్రి వెల్లంపల్లి](https://static.v6velugu.com/uploads/2023/08/jaganna-suraksha-scheme-is-best-scheme_iRfEXnuclG.jpg)
జగనన్న సురక్ష ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటికి ప్రభుత్వం చేరువ,పథకాలు లేదా పత్రాలకు సంభంధించిన సమస్యల కోసం ప్రతి ఇంటికి సర్వే చేసి జగనన్న సురక్ష క్యాంప్ ల ద్వారా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారు . వైసీపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటే చంద్రబాబు పెత్తందార్లకు అండగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సురక్ష పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 15వేల సచివాయలయాల్లో కోటిమంది కి లబ్ధి చేకూరిందని తెలిపారు. ఒక్కరోజే 7.5 లక్షల సర్టిఫికెట్లు అందించి రికార్డు సృష్టించామని మాజీ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 85వేల ఇళ్లకు చేరువై 90 క్యాంపుల ద్వారా 31వేల సర్టిఫికెట్లు అందించామన్నారు. ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకొనే చంద్రబాబుకు ఏనాడు ఇలాంటి ఆలోచన రాలేదని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో .. పథాకాల అమలులో ప్రభుత్వం పరంగా లోపం ఉండకూడదని సురక్ష పథకాన్ని తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
పవన్, లోకేష్ ల గురించి మాట్లాడుతూ ఒకరు సాయంత్రం పాదయాత్ర చేస్తే.. మరొకరు వారాహి అంటూ డైలాగులు చెపుతాడని విమర్శించారు. సినిమా రాజకీయాల వల్ల భయపడమంటూ.. పాలిటిక్స్ జీరో గా ఉన్న పవన్.. సినిమారంగంలో కూడా జీరో కాబోతున్నడని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే పవన్ ప్యాకేజీ రాజకీయాలు చేసి సినీ జీవితాన్ని పోగొట్టుకున్నాడన్నారు. పేదలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారన్నారు