కేసులో ఎత్తివేయించేందుకు కృషి చేస్తా: వర్కటం జగన్నాథ్​రెడ్డి

కేసులో ఎత్తివేయించేందుకు కృషి చేస్తా: వర్కటం జగన్నాథ్​రెడ్డి

మరికల్, వెలుగు: చిత్తనూర్, ఎక్లాస్​పూర్, జిన్నారం గ్రామస్తులపై నమోదైన కేసులను ఎత్తివేయించేందుకు తనవంతు కృషి చేస్తానని మక్తల్​ నియోజకవర్గ బీఎస్పీ ఇన్​చార్జి వర్కటం జగన్నాథ్​రెడ్డి తెలిపారు. శనివారం మండంలోని చిత్తనూర్​ గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేయడం, ఆపై ప్రజలు తిరగబడ్డారన్నారు. ఇందులో పోలీసులతో పాటు అమాయక ప్రజలు గాయపడడం బాధాకరమన్నారు.

కేసులు నమోదైన వారిలో చాలా మంది పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. పోలీసులు, ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఎస్పీని కలుస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కంపెనీని ఎత్తి వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఇటీవల మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. పాలెం వెంకటయ్య, అర్జున్​రాజ్, మహమ్మద్​ అమీర్, బండారి చంద్రశేఖర్, కందుకూరి శ్రీనివాసులు, నరసింహ, పరుశురాం, పుత్రసేన పాల్గొన్నారు.