నా మతం మానవత్వం.. ఇదే రాసుకోండి: జగన్

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఏపీ పాలిటిక్స్‎ను హీటెక్కించింది. ఆంధ్రప్రదేశ్‎తో పాటు యావత్ దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ కాకరేపుతోన్న వేళ జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్‎పై సంతకం చేసిన తర్వాతే జగన్ శ్రీవారిని దర్శించుకోవాలని అధికారం పక్షం, పలు హిందు సంఘాలు పట్టుబట్టాయి. లేదంటే జగన్‎ను అడ్డుకుని తీరుతామని ప్రకటించడంతో మాజీ సీఎం తిరుమల సందర్శనపై హైటెన్షన్ నెలకొంది.

 ఈ క్రమంలో జగన్ తన రేపటి (సెప్టెంబర్ 28) తిరుమల టూర్‎ను రద్దు చేసుకున్నారు. తిరుమల టూర్ క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణాలను ఇవాళ (సెప్టెంబర్ 28) జగన్ మీడియాకు వెల్లడించారు. ‘‘సీఎం హోదాలో తిరుపతి శ్రీవారికి ఐదేళ్లు పట్టు వస్త్రాలు సమర్పించా. గతంలో నా తండ్రి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి)  సీఎంగా శ్రీవెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు నేను అదే శ్రీవారి దర్శనానికి వెళ్తానంటే నీది ఏ మతం అని ప్రశ్నిస్తారా..? నా కులం, మతం ఏంటో ప్రజలకు తెలియదా..? ఇంట్లో నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా.

ALSO READ | జగన్ తిరుమల పర్యటన రద్దుకు కారణం ఇదే

 బయటకు వెళ్తే హిందు, ఇస్లాం, సిక్కు ఇతర మతాలను గౌరవిస్తా.  నా మతం మానవత్వం.. రాసుకుంటే డిక్లరేషన్‎లో ఇదే రాసుకోండి’’ అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతాల పేరిట రాజీకీయాలు చేయడం దౌర్భాగ్యం అని చంద్రబాబు సర్కార్‎పై నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తోన్న చంద్రబాబును హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.