సీనియర్ నటుడు జగపతి బాబు మరో డిఫ్రెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ‘సింబా’అనే చిత్రంలో నటిస్తున్నాడు. ది ఫారెస్ట్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్తో అరణ్యం నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంపత్‌నంది, రాజేందర్ నిర్మిస్తున్నారు.
జూన్ 5 (ఆదివారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింబాలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా ఓ డిఫరెంట్ రోల్ను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా ఈ చిత్రంలో జగపతి బాబు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ మూవీకి డి.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా.. కృష్ణప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు