హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమీప బంధువులైన ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారుచేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే మాజీ మంత్రి అఖిలప్రియ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హఫీజ్ పేట శివార్లలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను బోయిన్‌పల్లిలోని వారి నివాసంలో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిన వ్యవహారంలో జగత్ విఖ్యాతరెడ్డి కూడా స్వయంగా పాల్గొన్నాడని పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. కేసులో ఏ1 ముద్దాయి మాజీ మంత్రి అఖిలప్రియ.. ఏ2 ముద్దాయి ఏవీ సుబ్బారెడ్డి, ఏ3 అఖిలప్రియ భర్త భార్గవ రామ్ గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ ఇంకా జరుగుతోందని, మరికొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే ఇప్పటికే అరెస్టయిన 15 మంది బెయిల్ పిటిషన్ ను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి