భూపాలపల్లి జిల్లాలో ఘనంగా భోగ్‌‌ భండార్‌‌

మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో శుక్రవారం హేమాసాథ్‌‌ మహరాజ్, జగదంబా భోగ్‌‌ భండార్‌‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. బీఆర్‌‌ఎస్‌‌ మంథని ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌ పుట్ట మధు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

కార్యక్రమంలో పూజారి శ్రీరాంనాయక్, లీడర్లు జక్కు రాకేశ్‌‌, కల్వచర్ల రాజు, మందల రాజిరెడ్డి, మార్క రాముగౌడ్, మెండ వెంకటస్వామి, రాధారపు స్వామి, బానోత్‌‌ జగన్‌‌నాయక్‌‌ పాల్గొన్నారు.