కూరగాయల కత్తితో బైపాస్ సర్జరీనా..? ధన్​ఖడ్​

కూరగాయల కత్తితో  బైపాస్ సర్జరీనా..? ధన్​ఖడ్​

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్​ధన్ ఖడ్  స్పందించా రు. ఆ తీర్మానం చదివి ఎంతో బాధపడ్డానని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో మహిళా జర్నలిస్టుల భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘కూరగాయలు కోసే కత్తితో బైపాస్ సర్జరీ చేస్తారా..? బైపాస్ సర్జరీకి అలాంటి కత్తి వాడొద్దని మాజీ ప్రధాని చంద్రశేఖర్ జీ ఒకసారి అన్నారు. ప్రతిపక్షాలు నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూరగాయలు కోసే కత్తి కూడా కాదు. అది తుప్పుపట్టిన కత్తి. ఆ తీర్మానం చదివాక నాకు ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగింది” అని ధన్ ఖడ్ అన్నారు.