రుణమాఫీపై ఏ బాయికాడ మాట్లాడుదాం.. కేసీఆర్కు జగ్గారెడ్డి సవాల్

రుణమాఫీపై ఏ బాయికాడ మాట్లాడుదాం.. కేసీఆర్కు  జగ్గారెడ్డి సవాల్

హైదరాబాద్:  ‘కేసీఆర్​పదేండ్లలో 20 వేల కోట్లు రుణమాఫీ చేస్తే..  రేవంత్​రెడ్డి సర్కార్​ఏడాదిలోనే 22 వేల కోట్లను మాఫీ చేసింది..  పదేండ్లలో వాళ్లు చేస్తే.. మేం ఏడాదిలోనే  చేశాం. కేసీఆర్​గొప్పోడా.. లేదా రేవంత్​రెడ్డి గొప్పోడా.. ? ప్రజలు ఆలోచించాలి. రుణమాఫీ మీద డిబేట్​కు కేసీఆర్​ఎక్కడికి వస్తాడో చెప్పాలి.  ఏ బాయి కాడికి, ఏ రచ్చబండ దగ్గరికి వచ్చిన సరే..  నేను సిద్దమే’  అని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​జగ్గారెడ్డి అన్నారు. 

ఇవాళ గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు..  దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో మహిళలు  ఫ్రీ జర్నీ చేస్తే  కేసీఆర్​ఓర్వ లేక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.  ‘ మేము అడ్డుకుంటే  బీ ఆర్ ఎస్ సభ నడిచేదా? బీఆర్ ఎస్ నాయకులు  డాన్స్ లు చేసే వారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి స్వేచ్ఛ దొరికింది.  సచివాలయంలోకి అందరూ స్వేచ్ఛగా పోతున్నారు.  కేసీఆర్ హాయంలోకి ఎవ్వరిని పోనియ్యలేదు’ అని జగ్గారెడ్డి అన్నారు.

►ALSO READ | డీపీఆర్లో ఒకటి చెప్పి.. మరో చోట బ్యారేజీలు కట్టారు..కేసీఆర్ ఏది చెబితే అదే చేశారు: ఉత్తమ్