జగ్గారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన విజయశాంతి

జగ్గారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన విజయశాంతి

కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే కేసీఆర్  కూడా యూపీఏలో చేరుతారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు ఆ పార్టీ నేత విజయశాంతి.  స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ చావో రేవో తేల్చుకునే విధంగా పోరాడుతుంటే టీఆర్ఎస్ యూపీఏలో చేరుతుందని చెబితే ప్రజలు కాంగ్రెస్ కు బదులు టీఆర్ఎస్ కే ఓటు వేసే ఛాన్స్ ఉందన్నారు.  టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉందని కూడా ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి విశ్వసిస్తున్నారేమో అన్న అనుమానం కల్గుతుందన్నారు విజయశాంతి.