
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రేసులో తాను లేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పదవి కావాలని ఎవరిని అడగలేదని చెప్పారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ తన పట్ల చూపుతున్న తీరుకు తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నారు. అలాగే, గాంధీ భవన్ లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే కుమార్ రావుకు కూడా సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ ఇవ్వాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.