ఎమ్మెల్సీ రేసులో లేను : జగ్గారెడ్డి

ఎమ్మెల్సీ రేసులో లేను : జగ్గారెడ్డి
  • పార్టీ పరిస్థితులను వివరించేందుకే ఢిల్లీకి వచ్చా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్సీ రేసులో లేనని, ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

గతంలో తాను సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభను నిర్వహించి, దాన్ని సక్సెస్ చేశానని, రాష్ట్రంలో అప్పటి పార్టీ పరిస్థితి, ఇప్పటి పరిస్థితిని రాహుల్ కు వివరించాలని ఢిల్లీకి వచ్చినట్టు ఆయన చెప్పారు. రాహుల్ ను కలిసి ఆయనకు అన్ని విషయాలు చెప్తానన్నారు. ఎమ్మెల్సీ పదవిని అడిగేది లేదని, అలాంటి గుణం తనది కాదని జగ్గారెడ్డి వెల్లడించారు.