దేశంలో ఏ ఊరెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తది : జగ్గారెడ్డి

దేశంలో ఏ ఊరెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తది : జగ్గారెడ్డి
  • ఉనికి కోసమే బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని, ఏ అవ్వ, తాతను అడిగినా ఇందిరమ్మ ఇండ్లలోనే ఉంటున్నామని సమాధానం చెబుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, ఆ పార్టీకి గత లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పొరపాటున 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. 

ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని సంజయ్ బెదిరిస్తున్నారు. బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇందిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెబుతుందో చూద్దాం. బీజేపీ విలువలతో కూడిన రాజకీయం చేయడం లేదు”అని మండిపడ్డారు. ఇందిరాను విమర్శించడంపై సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.