నా లవ్​స్టోరీ సినిమాలో ఉండదు..మర్డర్​ నుంచి తప్పించుకున్న తీరుపైనే సినిమా: జగ్గారెడ్డి

నా లవ్​స్టోరీ సినిమాలో ఉండదు..మర్డర్​ నుంచి తప్పించుకున్న తీరుపైనే సినిమా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఒక రాజకీయ పార్టీ నేత తనను మర్డర్ చేసేందుకు ప్లాన్ వేస్తే.. దాని నుంచి తప్పించుకున్న తీరుపైనే తాను సొంతంగా తీస్తున్న సినిమాలో చూపించబోతున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి ప్రతివ్యూహం పన్నాను అనే అంశాలు ఇందులో ఉంటాయన్నారు.

సోమవారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను స్టూడెంట్ లీడర్​గా, ఆ తర్వాత  కౌన్సిలర్​గా, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్​గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని.. అయితే, ప్రేమికులకు తాను అండగా నిలిచిన పాత్ర ఉంటుందన్నారు. తన సినిమాకు డైరెక్టర్​గా రామానుజం పనిచేస్తున్నాడని చెప్పారు.