కాంగ్రెస్ కేడర్ ఉఫ్ అంటే కేసీఆర్​ గాల్లో కొట్టుకుపోతాడు : జగ్గారెడ్డి

కాంగ్రెస్ కేడర్ ఉఫ్ అంటే కేసీఆర్​ గాల్లో కొట్టుకుపోతాడు : జగ్గారెడ్డి
  • ఓటేయ్యకుంటే ప్రజలకు శాపనార్థాలు పెడ్తవా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కొడితే మాము లుగా ఉండదని తనకు తాను గొప్పగా చెప్పుకోవడంపై బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కు మాటల్లో ఉన్న బలం.. చేతల్లో లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కోపం వచ్చి ఉఫ్ అని అంటే కేసీఆర్ గాలికి కొట్టుకుపోతాడని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రారు అని, ఎవరైనా సరే ఆయన దగ్గరకే వెళ్లాలని, అసెంబ్లీకి రాని కేసీ ఆర్ వద్దకే శాసన సభను తీసుకెళ్లాలా అని ప్రశ్నించారు.

కేసీఆర్.. నీకు ఓట్లేస్తే జనం మంచి వాళ్లా, లేదంటే చెడ్డోళ్లా, వాళ్లకు శాపనార్థాలు పెడతావా.. అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ 5లక్షల మందితో సభ పెడితే.. రేవంత్ అంతకన్నా ఎక్కువ మందితోనే సభ పెట్టగలడు అని అన్నాడు. తులం గోల్డ్​కు ప్రజలు ఆశపడ్డారని అవమానిస్తావా.. కేసీఆర్, వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.