రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి: జగ్గారెడ్డి సవాల్

రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి: జగ్గారెడ్డి సవాల్
  • రుణమాఫీపై చర్చకు మేం సిద్దం..
  • కేసీఆర్​ను తీసుకువచ్చే కెపాసిటీ ఉందా..? 
  • పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి ఫైర్​ 

హైదరాబాద్: రుణమాఫీపై  హరీష్ రావు  ఢిల్లీ లో ధర్నా చేస్తామని బ్లాక్​మెయిల్​చేస్తుండని  హరీశ్​ఢిల్లీలో  ఫ్లయిట్ దిగే లోపే  తాను కేసీఆర్​ ఫామ్ హౌజ్ ముందు ధర్నాకు కూర్చుంటానని   పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి సవాల్​విసిరారు.   పదేళ్లు రైతులను మోసం చేసిన కేసీఆర్ ఫామ్​హౌస్​దగ్గర దీక్ష  చేస్తానని  రాసిపెట్టుకోమని మాజీ మంత్రిపై ఫైర్​అయ్యాడు.

హరీశ్​దొంగ దీక్షలను ప్రజలు నమ్మేపరిస్థితి లేరన్నారు.  కేసీఆర్​కుటుంబానికి రాహుల్​గాంధీ ఇంటి ముందు ధర్నా చేసే హక్కు లేదన్నారు.ఇవాళ ( అక్టోబర్ 5, 2024 ) గాంధీభవన్​లో ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ..  రుణమాఫీ కోసం ఆగస్టులో  ప్రభుత్వం రూ. 18 వేల కోట్లను  మంజూరు చేసిందని తెలిపారు.  రుణమాఫీ కోసం ఇంకో రూ. 12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ’  చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ ఆగింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు  ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మేం రుణమాఫీ చేశాం.  దీనిపై చర్చకు నేను సిద్దం.  .. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి.  కేసీఆర్​ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీశ్​రావు కు ఉందా.?   కేసీఆర్ ను హరీశ్​రావు చర్చకు తీసుకువస్తే సీఎంను ఒప్పించి తీసుకువస్త.  మాతో చర్చకు మీకు భయంగా ఉంటే..  సిద్దిపేటలోనే  చర్చ పెట్టిండి..  మేము సిద్దమే.. రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది’ అని  జగ్గారెడ్డి అన్నారు.