నేను పీసీసీ అడగడం కొత్త కాదు..అవకాశం వచ్చిన ప్రతిసారి అడుగుతా: జగ్గారెడ్డి

 పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ పదవి కోరుకోవడం  కొత్త కాదన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సారి అడుగుతానని చెప్పారు. రెడ్లలో అవకాశం వస్తే లిస్టులో తాను కూడా ఉంటానని చెప్పారు.  పీసీసీ మార్పుకు ఇంకా సమయం ఉందన్నారు.  ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాలన్నారు. బస్టాండ్ లో తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతానని చెప్పారు.

 మందకృష్ణ మాదిగ బీజేపీకి లాభం చేకూరేలా మాట్లాడుతున్నారని  జగ్గారెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.  ప్రశాంత్ కిషోర్ ఓసారి బీజేపీ అంటారు ఇంకోసారి కాంగ్రెస్ అంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పారు కానీ కాంగ్రెస్ వచ్చిందని గుర్తు చేశారు.   కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రస్టేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.