బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ తన సోషల్ మీడియా టీమ్‌ను అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే మేం కంట్రోల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతోన్న ప్రతి పనిపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడితే సహించమని తేల్చి చెప్పారు.
Also Read :- బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీస్ శాఖ సీరియస్
శనివారం (అక్టోబర్ 26) జగ్గారెడ్డి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్ రావుల తీరుపై ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే కేటీఆర్, హరీష్ తట్టుకోలేపోతున్నారు.. ఇద్దరూ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పేదళ్లతో చేసిన తప్పులను సరిదిద్దుతున్నామన్నారు. అలాగే.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నామని తెలిపారు.