ఎంపీ అనిల్కు తన మెడలోని గోల్డ్ చైన్ వేసిన జగ్గారెడ్డి

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు  కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గోల్డ్ ఛైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్  ఇవాళ(ఏప్రిల్ 9) ఉదయం గాంధీ భవన్ లో  జగ్గారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి తన మెడలోని గోల్డ్ ఛైన్ ను తీసి అనిల్ మెడలో వేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.

అంతకుముందు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి పీసీసీ చీప్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ పదవి అడగడం కొత్త కాదని..అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.  కేసీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నారు..అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు.