హైదరాబాద్, వెలుగు: ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే రాష్ట్రానికి ఐటీఐఆర్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏనాడు ఐటీఐఆర్‌పై చర్చ చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టు సాధించే వరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఈ విషయాన్ని గుర్తుచేస్తూనే ఉంటానన్నారు.