కేంద్రమంత్రులను కలుస్తా .. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రులను కలుస్తా .. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణకు కాంగ్రెస్ ITIR ఇస్తే మోదీ పక్కన పెట్టారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైదరాబాద్ కు ITIR వస్తే కోట్లాది పెట్టుబడులు వస్తాయన్నారు. ఈరోజు(బుధవారం) గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.త్వరలోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి హైదరాబాద్ కు ITIR తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తానన్నారు. ITIR తెచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

తాను చిన్నప్పుడు ఆరెస్సెస్ శాఖకి వెళ్ళినప్పుడు రఘునందన్ కు ఆ శాఖ గురించి కూడా తెలియదన్నారు. తాను ఎంత కష్టపడుతానో కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయకు మాత్రమే తెలుసునన్నారు. తన గురించి రఘునందన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు జగ్గారెడ్డి. తాను బీజేపీలో ఉన్న సమయంలో తనకు తల్లిలాగా లేదని, అప్పుడు తానే తల్లిపాత్ర పోషించి ఆ పార్టీకి గుర్తింపు తెచ్చానని తెలిపారు.