హైదరాబాద్, వెలుగు: వ్యాపారాలకు డిజిటల్ సొల్యూషన్స్అందించే ఫిన్‌టెక్ కంపెనీ జగిల్హైదరాబాద్లో శనివారం తన ఆఫీసును ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో దీనిని 17,500 చదరపు అడుగుల్లో నిర్మించారు.
ఇక్కడి నుంచి గ్లోబల్ ఆపరేషన్స్, బిజినెస్ ఫంక్షన్స్ నిర్వహిస్తామని జగిల్ తెలిపింది. ఇందులో 400 మంది పనిచేస్తారు. ఆటోమేటెడ్ స్టాండింగ్ డెస్క్స్, సౌండ్‌ప్రూఫ్ ఫోన్బూత్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 13 స్టార్టప్‌ల ఫౌండర్లు, ఏఐఎస్‌లు సజ్జనార్, జయేశ్ రంజన్ హాజరయ్యారు.