కవిత అరెస్ట్.. టపాసులు పేల్చి బీజేపీ నాయకులు సంబరాలు

కవిత అరెస్ట్.. టపాసులు పేల్చి బీజేపీ నాయకులు సంబరాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ సీనియర్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.  కవితను అరెస్టు చేయడం శుభసూచికమని అన్నారు.  ఈడీ తన పని తాను చేసిందని చెప్పారు.  ఈ రోజు ధర్మం గెలిచిందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టముందు సమానమేనని తెలిపారు.  

కవిత తప్పు చేయకపోయి ఉంటే ఈడీ పంపిన నోటీసులకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదన్నారు. ఇక  భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి అంతం బీజేపీ పంతం అంటూ నినాదాలు చేశారు. 

మరోవైపు కవిత అరెస్ట్ కు నిరసనగా జగిత్యాల జిల్లాలోని కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా చేపట్టారు.  పార్లమెంట్ ఎన్నికలలో లబ్ది పోందడానికే బీజేపీ కవితను అరెస్ట్ చేయించిందిని ఆరోపించారు.  ఈడి, ఐటీలు మోడీ జేబు సంస్థలని,  బీజేపీలో చేరితే ఎలాటి కేసులు ఉండవన్నారు. వెంటనే కవితను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.