తెలంగాణలో క్రీడా విప్లవం : సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలో 18వేలకుపైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా కిట్లు పంపిణీ చేస్తూ సీఎం కేసీఆర్​ క్రీడా విప్లవ నాంది పలికారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్ ​అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు. 

చల్‌‌‌‌‌‌‌‌గల్​వ్యవసాయ మార్కెట్లో రూ.1.70కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ కల్లాల నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ వసంతతో కలిసి భూమి పూజ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్​రాధ, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, మహిపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.