విలీన గ్రామాల్లో పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు

విలీన గ్రామాల్లో  పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు
  •  ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కట్టేది జగిత్యాల బల్దియాకు.. పర్మిషన్లు జీపీల్లో
  •  8 ఏండ్ల కింద బల్దియాలో శివారు గ్రామాల విలీనం 
  •  అధికారుల తప్పిదంతో కొన్ని సర్వే నంబర్లు మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •  కలపని సర్వే నంబర్లతో జనం అవస్థలు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియాలో విలీనమైన గ్రామాల్లో పర్మిషన్లు తీసుకునేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బల్దియాకు కడుతుండగా, టెక్నికల్ ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పర్మిషన్లు పాత జీపీల్లోనే తీసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జగిత్యాల బల్దియాలో 8 ఏండ్ల కింద శివారు గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. విలీన టైంలో అధికారుల తప్పిదంతో కొన్ని సర్వే నంబర్లను బల్దియాలో కలపలేదు. సర్వే నంబర్లు మిస్సయ్యాయని అప్పట్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. 

  2018లో బల్దియాల ఆరు గ్రామాలు విలీనం 

2018లో జగిత్యాల మున్సిపాలిటీలో శివారులోని ఆరు గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామాల్లోని మున్సిపాలిటీకి సమీపంలోని ప్రాంతాలనే బల్దియాలో కలపగా.. ఇప్పటికీ ఆ జీపీలు కొనసాగుతున్నాయి. లింగపేట, హస్నాబాద్, ధరూర్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, మోతె పరిధిలోని సర్వే నంబర్లను సర్వే చేసి విలీనం చేసినట్లు అధికారులు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివేదిక పంపారు. దీంతో ఈ నంబర్లను బల్దియాలో కలుపుతూ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. 

 కాగా రెవెన్యూ ఆఫీసర్లు చేసిన సర్వేలో మోతె పరిధిలోని 33 నుంచి 44వరకు, 200–211, 221–229, 231–327, 342–641, 644–673 సర్వే నంబర్లను కలుపుతూ బల్దియా హద్దును నిర్ణయించారు. కాగా మోతె శివారులోని సర్వే నంబర్లను మాత్రమే నివేదికలో పొందిపరిచిన అధికారులు.. మధ్యలో కొన్ని నంబర్లను పట్టించుకోలేదు. దీంతో 33–45 వరకు, 359–572, 574–576, 583–641, 643–673వరకు సర్వే నంబర్లు గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాలేదు. 

టీజీబీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని సర్వే నంబర్లకు బల్దియా ట్యాక్సే 

గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాని సర్వే నంబర్లకు సంబంధించి భూములకు రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు వివాదాస్పదమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సర్వేనంబర్లతోపాటు మిస్ అయినవి కూడా బల్దియా పరిధిలోనివిగా నమోదయ్యాయి. దీంతో ఆ శాఖ రూల్స్ ప్రకారం ల్యాండ్స్ మ్యూటేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే బల్దియా ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. తీరా పర్మిషన్ కోసం బల్దియాలో అప్లై చేస్తే టీజీబీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సర్వే నంబర్లు కనిపించడంలేదని, పర్మిషన్ ఇవ్వలేమని ఆఫీసర్లు చేతులేస్తున్నారు.

దీంతో చేసేదేమీ లేక కొందరు గెజిట్ మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు పాత జీపీల్లోనే పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. కాగా గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిస్ అయిన సర్వే నంబర్లను బల్దియా పరిధిలో చేర్చాలని ఆఫీసర్లు గతంలోనే ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఇష్యూ ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉంది. దీంతో గతంలో ఉన్న జీపీల్లోనే  పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తోందని విలీన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 

గెజిట్ కోసం నివేదిక అందజేశాం:

గతంలో బల్దియాల్లో శివారు ప్రాంతాల్లోని జీపీల్లోని కొన్ని సర్వే నంబర్లను బల్దియాలో విలీనం కాలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల బల్దియా పరిధిలోకి రాలేదు. దీంతో మళ్లీ సర్వే చేసి మిస్సయిన నంబర్ల వివరాలతో పూర్తిస్థాయి నివేదిక ను ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. - శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జగిత్యాల