కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం : కేటీఆర్

జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం అని అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ అంటే హిందూ, ముస్లిం, ఇండియా, పాక్ యుద్ధాలు తప్ప ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. గొర్రెల మందకు తోడేలును కట్టినట్లే అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ అరు గ్యారెంటీలకు ఆగమైదామా.. ఆలోచిద్దామా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారని చెప్పారు. 

ధర్మపురి పట్టణంలో రూ.8.5 కోట్ల నిధులతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం, రూ.248 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్. రమణ పాల్గొన్నారు.