కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి.. రూ. 3 లక్షల నష్టం

జగిత్యాల జిల్లాలో  కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. రూ. లక్షల వరకు నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో గొర్రెల మందపై 2024 ఫిబ్రవరి 17 శనివారం అర్ధరాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 30కి పైగా గొర్రెలు మృతి చెందగా.. మరి కొన్ని గాయపడ్డాయి. దాదాపు మూడు లక్షల వరకు నష్టం జరిగిందని గొర్రెల యజమాని మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ స్పందించి ఆర్థిక సాయం అందించాలని మల్లేశం కోరాడు.