కథలాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి సర్పంచ్ మొలిగె లక్ష్మి బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె భర్త మాజీ సర్పంచ్ మొలిగె శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, శ్రీనివాస్దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించినందుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ రాజీనామాను పార్టీ రాష్ర్ట , జిల్లా బాధ్యులకు పంపించినట్లు పేర్కొన్నారు.