జగిత్యాల జిల్లా పర్యటన : సీఎంను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బాధితులు

జగిత్యాల జిల్లాలో నేడు సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు బాధితులు తరలి వచ్చారు. మహిళా రైతు చనిపోతే రైతు భీమా రాలేదని సీఎం స్వగ్రామం చింతమడక నుంచి మృతురాలి భర్త వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నానని, సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని బాధితుడు వేడుకున్నారు. తనకు వికలాంగుల ఫించన్ రావడం లేదని సీఎంకు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు వెళ్లనీయడం లేదని మరో బాధితునడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాలు వివరిస్తూ ఇంకో బాధితుడు కేసీఆర్ బొమ్మతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై కామెంట్స్ చేస్తూ రోడ్డుపై వ్యాఖ్యానించారు.

జగిత్యాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించడంతో పాటు జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా..పోలీసుల బందోబస్తుతో పాటు జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.