కిక్కిరిసిన ఎమ్మార్వో ఆఫీసులు.. ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం క్యూ

కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో లబ్దిదారులు ఎమ్మార్వో ఆఫీసులకు క్యూకట్టారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసిల్దార్ కార్యాలయాలకు పోటెత్తారు.  జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం లబ్దిదారులు  క్యూ లైన్లో బారులు తీరారు. 

జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎమ్మార్వో ఆఫీస్ ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల దరఖాస్తు దారులతో కిక్కిరిసింది.  బీసీ లోన్స్  అప్లై చేసుకునేందుకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు అవసరం కావడంతో ఎమ్మార్వో ఆఫీస్కు జనం  భారీగా తరలివచ్చారు.  శని,ఆదివారాలు ఎమ్మార్వో ఆఫీసుకు రెండు రోజులు సెలవు కావడంతో జూన్ 12వ తేదీ సోమవారం క్యాస్ట్, ఇన్కమ్  సర్టిఫికెట్ల కోసం  జనం బారులు తీరారు. 

ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జారీలో తహసిల్దార్ కార్యాలయ అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆర్డర్ వైస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు.