అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  •     జగిత్యాల జిల్లాలో ఘటన

కొడిమ్యాల,వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు సూసైడ్  చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాం సాగర్   గ్రామానికి చెందిన ద్యాగల బాపు (57) తనకున్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. పొలానికి నీటి సౌకర్యం లేకపోవడంతో కొద్దినెలల కింద 2బోర్లు వేశాడు. అదే టైంలో కూతురి పెండ్లి చేశాడు. దీంతో రూ.7 లక్షల దాకా అప్పులయ్యాయి. గతంలో గల్ఫ్ వెళ్లే ముందు కూడా అప్పులు చేశాడు.  పంటకు నీరందక దిగుబడి తగ్గిపోయింది. మనస్తాపానికి గురైన బాపు ఆదివారం ఉదయం పొలంలో మామిడిచెట్టుకు ఉరేసుకున్నాడు.