జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి గోల్డెన్ గార్డెన్ అవార్డ్

జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి గోల్డెన్ గార్డెన్ అవార్డ్ లభించింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో ఏప్రిల్ 15వ తేదీన నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్- 2022లో ఈ అవార్డ్ జ్ఞాపికను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు స్వీకరించారు. గోల్డెన్ గార్డెన్ అవార్డ్ జ్ఞాపికతో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష బుధవారం (ఏప్రిల్ 19న) కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ DFOను అభినందించారు.