
జగిత్యాల టౌన్/ రాయికల్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలోని మోతే పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. గులాబీ కార్యకర్తలు బాజిరెడ్డి గోవర్ధన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలో గాంధీచౌక్ నుంచి అంగడిబజార్ (పాత బస్టాండ్) వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలిసి ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్శన్ దావ వసంత, పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, రాయికల్ ఎంపీపీ సంధ్యారాణి, మున్సిపల్‌చైర్మన్ హన్మండ్లు, వైస్ చైర్‌పర్సన్ రమాదేవి, లీడర్లు బాపురెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.