రాయికల్, వెలుగు: అధికార కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం రాయికల్ పట్టణ, మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతుల సంక్షేమానికి కేసీఆర్కృషి చేశారన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో 25 వేల మందికి బీడీ పెన్షన్ అందజేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కుల, మత రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హనుమాండ్లు, ఎంపీపీ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ మారంపెల్లి రాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి, పాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.