ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి.. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని చీల్చుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనడం సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీని చీల్చే అవసరం తమకు లేదని, మీకు మీరే చీల్చుకుంటున్నారని అన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ నాయకులను కాపాడుకోండి అంటూ సెటైర్ వేశారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. దేశంలోని పది రాష్ట్రాల్లో నిలబడడానికి కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీ ఎంత ఇబ్బంది పెడుతుందో తెలియదా..? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ అవుతే సంతోషిస్తారా..? అని అన్నారు.