
జగిత్యాల, వెలుగు : జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను సీడీఎంఏకు సరెండర్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆర్డర్స్ జారీ చేశారు. ప్రజాప్రతినిధులకు, పాలన విషయాల్లో సహకరించకపోవడం, అడిషనల్ కలెక్టర్‌తో వాగ్వాదంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తుండడం వల్లే మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను సీడీఎంఏకు సరెండర్ చేసినట్లు సమాచారం. రాయికల్ ఎంపీడీవో బి. చిరంజీవికి జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.