జగిత్యాల పట్టణంలో రాత్రి ఓ పాపకు ఆరోగ్యం బాగాలేదని బైక్ పై ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దంపతులను వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు నిలిపివేశారు. గర్భిణీ, చిన్న పాప ఉందని కూడా చూడకుండా చెకింగ్ లో ఆపి, బండి పేపర్స్, ఈ చాలన్ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కట్టి వెళ్లాలని పోలీసుల జులుం ప్రదర్శించారు. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి.. తన పాపకు హెల్త్ బాగా లేదని మెురపెట్టుకున్నాడు. అయినా కూడా పోలీసు సిబ్బంది కనికరించలేదు.
ఈ సమయంలో ఏడుస్తోన్న చిన్నారిని ఆ తల్లి రోడ్డు పక్కనే కూర్చుని పాలు ఇస్తున్న దృశ్యం అక్కడి వారందరినీ కలచివేసింది. దీంతో అటుగా వెళ్తున్న మీడియా వాళ్ళు చూసి వీడియో తీయడం ప్రారంభించడంతో పోలీసులు వారిని అక్నడ్నుంచి పంపించారు.