పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ : ఎస్పీ అశోక్ కుమార్

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ : ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, వెలుగు : ఈ నెల 27న జరగనున్న టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీఎస్పీలు, సీఐలతో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆయా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 71 పోలింగ్ కేంద్రాల్లో 36,423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును  వినియోగించుకుంటారని వివరించారు.