జగిత్యాల టౌన్ సీఐ నటేశ్ సస్పెన్షన్​

జగిత్యాల, వెలుగు: జగిత్యాల టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నటేశ్​ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అవినీతి, క్రైం బార్కింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇన్ స్పెక్టర్ నటేశ్​ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్​లో భూ దందాలపై సీపీ అభిషేక్ మహంతి సిట్ ఏర్పాటు చేశారు.

భూమి విషయంలో అక్కడి భగత్ నగర్ కు చెందిన కొత్త రాజిరెడ్డిని ఇబ్బందులు పెడుతున్నారని ఇటీవల బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యామ్​అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంలో గతంలో అక్కడ పనిచేసిన సీఐ నటేశ్ వారికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ట్రావెల్స్ నిర్వాహులకు సంబంధించిన కేసు విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐని సస్పెండ్​ చేసినట్లు తెలుస్తోంది.