ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్..సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి ఫిర్యాదు

ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్..సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి ‘X’లో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  @AravindAnnaArmy అనే ‘X’​ హ్యాండిల్ తో పాటు దాని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొంది. సోమవారం మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.