- అక్రమ పర్మిషన్లపై విచారణ
కొడిమ్యాల, వెలుగు : ఇల్లీగల్ వెంచర్‌కు పర్మిషన్లు ఇచ్చిన ఘటనపై జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. కొడిమ్యాల మండలం అప్పారావుపేటలో కొందరు రియల్టర్లు కలిసి అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో రఘువరన్, ఎంపీడీవో స్వరూప విచారణ చేపట్టారు.
ఒక్కరోజులోనే జీపీ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఎలాంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండానే ఈ వెంచర్‌లో 17 ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రక్రియలో సుమారు రూ.20లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. దీనిపై అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లీగల్‌గా ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.