బీఆర్ఎస్​ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే విజయం : జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు: బీఆర్ఎస్​ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ​విజయం సాధిస్తుందని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్​పట్టణంలో గురువారం పోచమ్మతల్లికి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పూజలు చేసి, 11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్​ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.

ప్రచారంలో బీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. సమస్యలపై స్పందిస్తూ మీ కోసం నిలబడి కొట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తున్నానన్నారు. జీవితం చివరి అంకం వరకు ప్రజా జీవితంలో కొనసాగడానికి తనకు మీ ఆశీర్వాదం కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్​అధ్యక్షుడు రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, లీడర్లు మహిపాల్​రెడ్డి, నర్సయ్య, షాకీర్, శ్రీకాంత్, దివాకర్​రెడ్డి పాల్గొన్నారు.