కోరుట్ల, వెలుగు : జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, గండ్లు పడిన చెరువులకు యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో కొచ్చేరువు మత్తడి గండిని పరిశీలించారు. అనంతరం ఇప్పపల్లి శివారులోని రోడ్డుపై ఏర్పడిన గొయ్యిని
పోతారం గ్రామం నుంచి తండాకు వెళ్లే మార్గంలో ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ముంతాజొద్దిన్, ఎంపీడీవో శంకర్, ఎంపీవో రాజశేఖర్, ఇరిగేషన్, పీఆర్ అధికారులు ఉన్నారు.
కొడిమ్యాల, వెలుగు : భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. గురువారం కొడిమ్యాల మండలంలో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కోనాపూర్–సండ్రల్ల పల్లె గ్రామాలకు వెళ్లే బ్రిడ్జిలను పరిశీలించి వెంటనే రిపేర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.