ఓటర్ లిస్ట్ లో తన పేరు తొలగించారని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి ఇంటి కెళ్లారు జిల్లా కలెక్టర్. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో జరిగింది.
ఓటర్ లిస్టులో తన పేరును తొలగించారని ఫిర్యాదు చేశాడు నవీన్ అనే వ్యక్తి. ఏకంగా ఫిర్యాదు దారుని ఇంటికి స్వయంగా వెళ్లి విచారించారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ .ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఇటీవల గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు అధికారులు. అధికారుల ప్రదర్శించిన లిస్టులో తమ పేరు తొలగించారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు నవీన్. గ్రామంలోని ఇద్దరి పేరు ఒకే విధంగా ఉండడంతో పొరపాటు జరిగిందని కలెక్టర్ కు తెలిపాడు బూత్ లెవెల్ అధికారి .దీంతో వెంటనే తప్పును సరి చేసి బింగి నవీన్ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేయాలని ఆదేశించారు కలెక్టర్.
ALSO READ : కేసీఆర్ కు సండ్ర ఆహ్వానం