ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లకు పటిష్ట కార్యాచరణ : కలెక్టర్ సత్య ప్రసాద్

ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లకు పటిష్ట కార్యాచరణ  : కలెక్టర్ సత్య ప్రసాద్

కోరుట్ల వెలుగు:  ,ప్రభుత్వం ప్రకటించిన 25శాతం డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకొని మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్​అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు. గురువారం కోరుట్ల మున్సిపల్​ఆఫీస్​లో ఇంటి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్ల తీరును కలెక్టర్ పరిశీలించారు. కోరుట్లలోని ఆస్తి పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  2 రోజుల్లో పెండింగ్​ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

 కోరుట్లలో ఇప్పటివరకు 80 శాతం ఇంటి పన్ను వసూలు అయ్యిందని, ఈనెల 31 వరకు  గడువులోపు వంద శాతం పూర్తిచేయాలన్నారు. కోరుట్లలో 46 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం ఆమోదించామన్నారు. ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని, ప్రతిఒక్కరూ పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అనంతరం అర్బన్  ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్​ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, అధికారులు ఉన్నారు.