హాస్పిటళ్లలో టైమ్​కు రాకపోతే డాక్టర్లపై చర్యలు: కలెక్టర్​ సత్యప్రసాద్​

హాస్పిటళ్లలో టైమ్​కు రాకపోతే డాక్టర్లపై చర్యలు: కలెక్టర్​ సత్యప్రసాద్​

రాయికల్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు సమయపాలన పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. మంగళవారం రాయికల్​ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి , అందుతున్న సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటళ్లలో నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు చేయించి, కలర్లు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్​ఎం.ఎ ఖయ్యుం,  మున్సిపల్ కమిషనర్  శ్రీనివాస్​గౌడ్​, అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన 

మల్లాపూర్, వెలుగు:- ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం సర్వే జరుగుతుందని, అర్హులకు  ఇండ్లు ఇస్తామన్నారు. ఆయనవెంట ర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఈ అబ్దుల్ రెహమన్, తహసీల్దార్ వీర్ సింగ్, ఎంపీడీవో జగదీష్, అధికారులు పాల్గొన్నారు.