ఓట్లను ఒడిబియ్యంగా అడుక్కుంటున్నా..మీ ఆడబిడ్డను బతికించుకుంటారా..సంపుకుంటారా..: బోగ శ్రావణి

ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో రాష్ట్రంలో అభ్యర్థులు రోజురోజుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాజగా జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు ఒడిబియ్యం రూపంలో అందించి.. మీ ఆడబిడ్డను సంతోషంగా పంపిస్తారా.. మీ ఆడబిడ్డను బ్రితికించుకుంటారా.. మీ ఆడబిడ్డకు ఇప్పుడు ఏమైనా అయితే గనుక.. బతికే పరిస్థితి ఉండదు.. బ్రతకనివ్వరు.. ఇక్కడ ఉండనివ్వరు కూడా.. ఒడిచాచి ఓట్లను ఒడిబియ్యంగా అడుక్కుంటున్నా.. ఒడిబియ్యం ఇచ్చి.. మీ ఆడబిడ్డను దీవిస్తారా.. సంపుకుంటారా నిర్ణయం మీ చేతుల్లో ఉంది.. ఆశీర్వదించండి అంటూ.. 

జగిత్యాల (నవంబర్ 28) విలేఖర్ల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు  చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేటలకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు బోగ శ్రావణి.